కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా వల్లంపట్ల (Vallampatla) గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ‘మన ఊరు–మన బడి’ (Mana Ooru-Mana Badi) కార్యక్రమం కింద నిర్మించిన అదనపు పాఠశాల గదులు, కిచెన్ షెడ్డుకు మాజీ సర్పంచ్ అనసూయ తాళం వేసి వివాదానికి తెరలేపింది.
స్థానికంగా నిర్మాణ పనులు పూర్తయినా, వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా చెల్లించలేదని అనసూయ ఆరోపించారు. బకాయిలు క్లియర్ చేసే వరకు తాళం తీసేది లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ చర్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విషయం తెలిసిన వెంటనే విద్యాశాఖ అధికారులు, స్థానిక పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. దీనితో గ్రామంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Read Also: లోక్ సభలో మహిళలకు 272 సీట్లు : కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్
Follow Us On : WhatsApp

