హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఫిట్‌నెస్ ఈవెంట్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: దేశంలోనే అతిపెద్ద ఫిట్ నెస్ ఈవెంట్‌కు హైద‌రాబాద్ (Hyderabad) వేదిక‌గా మారింది. నగరంలోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న‌ పీపుల్స్ ప్లాజా వద్ద ‘యువ భారత్ రన్’ (Yuva Bharat Run) పేరిట నేడు ఉద‌యం ఓ మెగా ఈవెంట్ నిర్వ‌హించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఎమ్మెల్సీ మ‌ల్క కొముర‌య్య ఆధ్వ‌ర్యంలో ఈ ర‌న్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ హీరో శ‌ర్వానంద్‌ పాల్గొన్నారు. ఫిట్ ఇండియా లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌కు 15 వేల‌కు పైగా యువకులు, విద్యార్థులు త‌ర‌లివ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. మ‌న దేశానికి యువ‌తే పెద్ద ఆస్తి అన్నారు. 20 ఏళ్ల‌లో విక‌సిత్ భార‌త్‌గా మారాలంటే యువ‌తే కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌పంచ దేశాల ముందు భార‌త్ ఒక శ‌క్తిగా మారాల‌ని ఆకాంక్షించారు. మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి మాట్లాడుతూ.. యువ‌త‌కు ఫిట్ నెస్ చాలా ముఖ్య‌మ‌ని, యోగా కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు. అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల‌ది అనాలోచిత యుద్ధ‌మ‌ని వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడ‌తాడో ఆయ‌న‌కే అర్థం కాద‌ని విమ‌ర్శించారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌తో భార‌త్ స్నేహ‌పూర్వ‌కంగా ఉంద‌ని చెప్పారు. భార‌త్‌తో పాటు ప్ర‌పంచ‌మంతా శాతియుతంగా ఉండాల‌ని ఆకాంక్షించారు.

 Read Also: మద్యం ప్రియులకు వార్​ షాక్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>