కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్(New Year) వేడుకలు సమీపిస్తున్న వేళ హైదరాబాద్(Hyderabad) నగర పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ మద్యం, నిషేధిత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉండే నగర సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) మందుబాబులకు ముందస్తు వార్నింగ్ ఇచ్చారు. డ్రంకెన్ డ్రైవ్‌ను(Drunk Driving) సహించేంది లేదన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. “మియా.. డ్రింక్ కియా.. తో స్టీరింగ్ కో సలాం బోల్‌కే క్యాబ్ పకడో.. గూగూల్ క్యాబ్.. నాట్ లాయర్..” అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. మందు తాగితే స్టీరింగ్ పక్కన పెట్టి క్యాబ్ బుక్ చేసుకోవాలని, డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి గూగుల్‌లో లాయర్ల గురించి వెతికే బదులు ముందు క్యాబ్ సెర్ఛ్ చేసుకోవాలని సూచించారు. దీనిపై నెటిజన్లు స్వీట్ వార్నింగ్ ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు.


