కలం వెబ్ డెస్క్ : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. బైక్(Bike) అదుపుతప్పి గుంతలో పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నిజాంపేట్ పరిధిలోని బీదర్ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులు, మల్లేశ్, మహేశ్‌లు నిజాంపేట్ నుంచి బీదర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ దారిపై నారాయణ్‌ఖేడ్ వద్ద కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. సమీపంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. కల్వర్టు గుంత ఉండటంతో వీరి బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. దీంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం నారాయణ్‌ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


