కలం వెబ్ డెస్క్ : శంషాబాద్(Shamshabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(RGIA) మరోసారి బాంబు బెదిరింపు(Bomb Threat) రావడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం జెడ్డా, కొచ్చి నుంచి శంషాబాద్ వస్తున్న రెండు ఇండిగో విమానాల్లో(Indigo Flights) ఆర్డీఎక్స్(RDX) అమర్చినట్లు మెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులు చేశారు. దీంతో అధికారులు రెండు విమానాలను శంషాబాద్‌లో నిలిపి ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మరోవైపు కోల్‌కతా నుంచి శంషాబాద్ వస్తున్న ఓ విమానంపై లేజర్ లైట్ పడటం ఆందోళన కలిగించింది. ఏటీసీ పైలట్ గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు.


