ప్రభుత్వం నడుపుతున్నారా..? సర్కస్​ నడిపిస్తున్నారా..? : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా..? సర్కస్ నడిపిస్తున్నారా..? అర్థం కావడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా ఉందని, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలానని నిలదీశారు. డిమాండ్ బుక్స్ లో అవుట్ కమ్ బడ్జెట్ ముద్రణ చేశారని, అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆర్థిక మంత్రి భట్టి.. తన సొంత ఆర్థిక కారణాలపై బిజీగా ఉన్నట్లు అనిపిస్తుందని ఆరోపించారు. తప్పును సరిదిద్దుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని జగదీష్​ రెడ్డి (Jagadish Reddy) డిమాండ్ చేశారు.

అవుట్ కమ్ బడ్జెట్, ఈ ఏడాది గ్రాంట్స్ బుక్ ఒకేలా ఉన్నాయన్నారు. గతంలో సాధించిన ఫలితాలు.. ఈ ఏడాది గ్రాంట్స్ పై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇది పొరపాటు కాదు నేరమే.. సభలో ఇదే విషయంపై మాట్లాడుతాననీ జగదీష్​ రెడ్డి పేర్కొన్నారు. డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా కాపీ ఫెస్ట్ చేశారని, ఉన్నది ఉన్నట్లు రెండు బుక్ లు తయారు చేస్తే ఎలా ప్రభుత్వం నడుపుతున్నట్టు అని ప్రశ్నించారు. తక్షణమే ఈ తప్పును సర్దుకొని సభకు చెప్పాలని.. దీనిపై సభలో ప్రస్తావనకు తెస్తానని మాజీ మంత్రి జగదీష్​ రెడ్డి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>