జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలపై ప్రణవ్ హామీ

కలం, కరీంనగర్: ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటామని హుజురాబాద్ (Huzurabad) కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల పట్టాల విషయంలో పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారు.

ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మంజూరు చేసిన ఇళ్ల పట్టాల విషయంలో జర్నలిస్టులకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల పట్టాలు అందేలా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>