కలం, వెబ్ డెస్క్ : మృత్యువు ఎప్పుడూ, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కోతిని తరుమబోయి ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఛతర్పూర్ (Chhatarpur)లో రిసార్ట్ పైకప్పు పైకి ఓ కోతి వచ్చింది. అయితే రిసార్ట్ ఉద్యోగి ఒక ఇనుప రాడ్‌ను ఉపయోగించి కోతిని తరిమేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హైటెన్షన్ విద్యుత్ తీగకు ఇనుప రాడ్ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షాకింగ్ వీడియో: కోతిని తరిమే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన రిసార్ట్ ఉద్యోగి!
Tragic Death of Resort Employee in Attempt to Chase Monkey!#ResortEmployeeDie #ElectricalShock #ShockingVideo #ViralVideo #MadhyaPradesh #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/t68TTDcIhX— Kalam Daily (@kalamtelugu) April 16, 2026

