‘ఒయాసిస్‌’ కేసులో కీలక మలుపు: డైరెక్టర్‌ మేఘన అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ (Oasis Fertility) సెంటర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ మేఘనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో తలదాచుకున్న మేఘనతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

ఫెర్టిలిటీ సెంటర్‌లో మహిళల అండాల సేకరణ వ్యవహారంలో మేఘన కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఒయాసిస్ చైర్మన్ సూర్యకిరణ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

సూర్యకిరణ్ విదేశాలకు పారిపోకుండా మల్కాజ్‌గిరి పోలీసులు ఇప్పటికే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసి, దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. అయితే, పోలీసుల నిఘా కంటే ముందే సూర్యకిరణ్ దేశం దాటి వెళ్లి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>