కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women Reservation Bill) పై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను విభజించిందని మండిపడ్డారు. గతంలో దేశం నుంచి పాకిస్తాన్ ను ఏవిధంగానైతే అశాస్త్రీయంగా విడగొట్టారో.. తెలంగాణను కూడా అదే విధంగా ఆంధప్రదేశ్ నుంచి విడదీశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ విభజనను కాంగ్రెస్ పాకిస్తాన్, భారత్ విభజనతో పోల్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేసిన విభజన బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజల మనోభావాలను, భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయా ప్రయోజనాల కోసమే ఆనాడు హడవుడిగా రాష్ట్రాన్ని ముక్కులు చేశారని విమర్శించారు. విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం నెలకొందని వ్యాఖ్యానించారు.
అంతేకాదు డీలిమిటేషన్‌పై (Delimitation) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నారని, ఆయన చెబుతున్నది విని తెలంగాణ ప్రజలు కూడా నవ్వుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) అన్నారు. రాష్ట్రాల జీఎస్‌డీపీ ఆధారంగా లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. సీట్ల పెంపునకు, జీఎస్‌డీపీ ముడిపెట్టాలన్న తెలంగాణ సీఎం సలహా అత్యంత మూర్ఖంగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల ఆదాయం అనేది ప్రతి సంవత్సరం మారుతుందని.. దానిని డీలిమిటేషన్ కు ప్రతిపదికగా తీసుకోవాలని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.
Read Also: ఏపీ నెక్స్ట్ సీఎం అతడే.. వర్మ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

