డీఎంకే సంచలన నిర్ణయం.. బిల్లుకు మద్దతు!

కలం, వెబ్ డెస్క్: డీఎంకే (DMK) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డీ లిమిటేషన్ బిల్లు (Delimitation Bill)కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే దాన్ని అమలు చేసే విధానంపై తమకు కొన్ని అనుమానాలున్నాయని మాత్రం తెలిపింది. ఇష్టారీతిన సరిహద్దుల ఏర్పాటు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చెన్నైలో డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్ పార్టీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. అందుకు సంబంధించిన నిర్ణయాలను ఎంపీ డి.రాజా వెల్లడించారు. లోక్‌సభలో తమిళనాడుకు ఉన్న 7.18 శాతం వాటా తగ్గొద్దని, అలాగే 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇక ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ఎంపీ సీట్లు 39 నుంచి 59 సీట్లకు పెంచాల్సిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నా, లేకున్నా బీజేపీకి తాము ఎప్పటికీ వ్యతిరేకమే అన్నారు. బిల్లు(Delimitation Bill)కు మద్దతు ఇచ్చినంత మాత్రాన బీజేపీతో తాము కలిసిపోయినట్లు భావించవద్దని డి.రాజా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. బిల్లుకు డీఎంకే మద్దతు ఇవ్వడంతో ఇక పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయినట్లవుతుంది.

Also Read : నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>