తీవ్రంగా గాయపడి.. ప్రముఖ WWE రెజ్లర్ మృతి

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ WWE రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ (Branson Reed) మరణించారు. సౌదీ అరేబియాలో జరిగిన ‘క్రౌన్ జువెల్’ ఈవెంట్‌లో తీవ్రంగా గాయపడిన బ్రాన్సన్ చికిత్స పొందుతూ మరణించినట్లు WWE అధికారికంగా ప్రకటించింది. 38 ఏళ్ల బ్రాన్సన్ మరణంపై రెజ్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రాన్ రీడ్ మరణించారనే విషాద వార్త చెప్పాల్సి రావడం బాధాకరం. వైద్యపరమైన కారణాలతో ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన ఎంతో గొప్ప రెజ్లర్, అంతకుమించి మంచి వ్యక్తి కూడా. కుటుంబాన్ని ఎంతో ప్రేమించే మనిషి. మంచి సహచరుడు కూడా. విషాదంలో ఉన్న ఆయన భార్య, గర్భిణిగా ఉన్న పైగే, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని వెల్లడించింది.

బ్రాన్సన్ రీడ్ ఆయన రింగ్ నేమ్ కాగా, అసలు పేరు జెర్మైనీ హేలీ. ఆస్ట్రేలియాకు చెందిన హేలీ.. చిన్న వయస్సులోనే రెజ్లింగ్ వైపు ఆకర్షితులై.. ఆటలో రాణించి WWE సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ‘క్రౌన్ జువెల్’ ఈవెంట్‌లో రెజ్లర్ ఓబా ఫెమీ బ్రాన్సన్ రీడ్‌ను ఎత్తుకుని టేబుల్‌పై విసిరేశాడు. ఈ క్రమంలోనే ఆయన పక్కటెములకు తీవ్ర గాయాలై మరణించినట్లు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>