కూలిన హోటల్ స్లాబ్.. నలుగురికి తీవ్ర గాయాలు

కలం, వెబ్​ డెస్క్​ : వికారాబాద్​ (Vikarabad) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మర్పల్లి మండల కేంద్రంలోని ఓ హోటల్​ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో హోటల్​ లోపల ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు జేసీబీ సాయంతో స్లాబ్ శిథిలాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీశారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. శిథిలాలా కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకోవడం ద్వారానే ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

Read Also: వైభవ్‌కు టీమిండియా కాల్.. సంబరాల్లో మునిగిన తాజ్‌పూర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>