కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ (Sangareddy Hostel Warden) అరాచకానికి పాల్పడ్డాడు. స్టూడెంట్లకు అన్నంలో విషం పెట్టి చంపేయండి అంటూ మాట్లాడిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. హాస్టల్ లో చాలా రోజులుగా కరెంట్ రావట్లేదని, తాగునీరు లేవని స్టూడెంట్లు జనవరి 1న నిరసన చేశారు. దీంతో రెచ్చిపోయిన హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్ స్టూడెంట్లను బూతులు తిట్టాడు. స్టూడెంట్ల మీద అనుచితంగా మాట్లాడుతూ.. అక్కడే ఉన్న వంట మనుషులతో.. అన్నంలో విషం కలిపి చంపేయండి అంటూ రెచ్చిపోయాడు. అంతే కాకుండా హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి విద్యార్థులను తోసేసి చంపేస్తా అంటూ బెదిరించాడు. దీంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు వార్డెన్ మీద కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వార్డెన్ కిషన్ నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: లండన్ రైళ్లలో ఇండియన్ సమోసా .. వీడియో వైరల్
Follow Us On: Youtube


