కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (Osmania University) విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ లా కాలేజీ హాస్టల్‌లో వడ్డిస్తున్న భోజనం నాసిరకంగా ఉంటోందంటూ విద్యార్థులు శనివారం రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమకు పెడుతున్న ఆహారం ఏమాత్రం బాగ లేదని, దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మెస్ నిర్వహణ దారుణంగా ఉందని విద్యార్థులు ఆరోపించారు. ఈ సమస్యపై గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఫిర్యాదులను గాలికి వదిలేశారని వారు మండిపడ్డారు. వీసీ, అధికారులు తమ నిర్లక్ష్య ధోరణిని వీడాలని, తక్షణమే మెస్ సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది.

ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ హాస్టల్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కారు
Osmania University Law Students Protest Over Poor Quality Food. #OsmaniaUniversity #OU #Hyderabad #StudentProtest #LawStudents #HostelFood #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/l4SAmmjrfN— Kalam Daily (@kalamtelugu) January 3, 2026
Read Also: అన్నంలో విషం కలిపి చంపేయండి.. స్టూడెంట్లపై హాస్టల్ వార్డెన్ అరాచకం
Follow Us On : WhatsApp


