కలం, హనుమకొండ: పేదలు, దివ్యాంగులు, వృద్ధులు, అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్న హోప్ ఫుల్ హార్ట్స్ సేవలు అభినందనీయమని ఏన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ మెడికల్ కాలేజీ (Kakatiya Medical College) ప్రాంగణంలో అత్యాధునిక ఆటోమేటిక్ వాటర్ ప్లాంట్ను (Water Plant) ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రి చికిత్స కోసం వచ్చే పేదలు కోసం 365 రోజులు స్వచ్ఛమైన మంచి నీరు అందుతుందన్నారు. సమాజ సేవలో ఏన్పీడీసీఎల్ ఉద్యోగులు ఎప్పుడు ముందుంటారన్నారు. డాక్టర్లు ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతున్నారో, అలాగే ఎన్పీడీసీసీఎల్ ఉద్యోగులు ప్రతిఒక్కరి ఇండ్లలో వెలుగులు నింపుతున్నారని తెలిపారు.
పేదల దాహర్తీని తీర్చడం కోసం నక్కలగుట్టలోని టీజీఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట మూడోసారి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్యా రాణి , పీఎంఎస్‌ఎస్‌వై సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ సి.హెచ్ మురళి, ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. హరీశ్ చంద్రా రెడ్డి, పీఎంఎస్‌ఎస్‌వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పీడియాట్రిక్ సర్జరీ హెచ్‌ఓడీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ బాలరాజ్, పీఎంఎస్‌ఎస్‌వై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ప్రతాప్ కల్లోగి, టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, పి. మధుసూదన్, సి. ప్రభాకర్ పాల్గొన్నారు.

