Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటి నుంచే ఓటు హక్కు: మూడు రాష్ట్రాల్లో ప్రారంభం

కలం, వెబ్ డెస్క్ : వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో హోమ్ ఓటింగ్ (Home Voting) విధానం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ అవకాశాన్ని కల్పించింది.

అస్సాం (Assam) రాష్ట్రంలో ఈ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. అక్కడ 85 ఏళ్లు పైబడిన 19,774 మంది వృద్ధులు, దివ్యాంగులు 6,638 మంది తమ ఇంటి నుంచే ఓటు వేసేందుకు రిటర్నింగ్ అధికారులు అనుమతి మంజూరు చేశారు. దీనివల్ల పోలింగ్ కేంద్రాలకు రాలేని వారు తమ నివాసాల నుంచే స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ప్రస్తుతం అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో వేగంగా కొనసాగుతున్న ఈ హోమ్ ఓటింగ్ (Home Voting) ప్రక్రియను ఏప్రిల్ 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిబంధనల ప్రకారం భద్రత, పారదర్శకత నడుమ ఈ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 2.37 లక్షల మందికి పైగా ఓటర్లకు వారి ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Read Also: బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం : బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>