epaper
Wednesday, February 18, 2026
epaper

సీఐపై కత్తితో దాడి చేసిన రౌడీ షీటర్..

కలం, వెబ్​ డెస్క్​ : సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupuram) నియోజకవర్గంలో కాల్పుల కలకలం సృష్టించాయి. హిందూపురంకి చెందిన సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్​ రవిపై రౌడీ షీటర్​ నాగేంద్ర కత్తితో దాడి చేశారు. అనంతరం పారిపోతున్న అతనిపై చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో రౌడీకి గాయాలు కాగా, అతడితో పాటు సీఐ, కానిస్టేబుల్​ ను ఆస్పత్రికి తరలించారు. నాగేంద్రపై ఏపీ, కర్నాటకలో 90కి పైగా కేసులు ఉన్నాయి. గతంలో హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్​ రేప్​ జరిగిన కేసులో రౌడీ షీటర్ నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులోనే అతడిని పట్టుకునేందుకు వెళ్లగా దాడికి పాల్పడ్డాడు.

Read Also: పవన్ సార్.. మా గ్రామానికి రోడ్డు వేయించండి: చిన్నారుల రిక్వెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>