కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉంటునే.. మరోవైపు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తుంటారు. ఈ కారణంగానే చాలామంది తమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కు మొర పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు (Nellore) జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లి (Gajjalavaripalli) గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు తమ ఊరి రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు.
తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో బురదగా మారిన బాటలో నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూలుకు వెళ్లాలన్నా, అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా నరకయాతన అనుభవిస్తున్నామని, తమ కష్టాలను గుర్తించి వెంటనే రోడ్డు వేయించాలని కోరారు.
గ్రామస్తుల విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పిల్లలే స్వయంగా “పవన్ సార్.. మా ఊరికి రోడ్డు వేయించండి” అంటూ రిక్వెస్ట్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో తమ సమస్యను పరిష్కారిస్తారని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఆలయాల ప్రసాదాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Youtube


