కలం మెదక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్నేహబంధం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ఎవరిని అరెస్టు చేయడం లేదని ఆయన అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తుందని, మంత్రులపై కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాలు, అవినీతి పాలనలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ (BJP) ప్రభుత్వమేనని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రామచందర్ రావు కోరారు.
Read Also: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. అక్రిడిటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Follow Us On : WhatsApp


