ఫిఫాలో ఇరాన్ పార్టిసిపేషన్‌పై వీడని ఉత్కంఠ

కలం, వెబ్ డెస్క్ : అమెరికా వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) 2026లో ఇరాన్ (Iran) జట్టు ఎంట్రీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఫుట్‌బాల్ మైదానానికి పాకాయి. తమ జట్టు టోర్నీలో పాల్గొనడం అనేది అప్పటి భద్రతా పరిస్థితులు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఇరాన్ క్రీడా మంత్రి అహ్మద్ దన్యామలి స్పష్టం చేశారు.

ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలో ఆడటం సాధ్యం కాకపోతే, మ్యాచ్‌లను మెక్సికోకు మార్చాలని ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఫిఫా ప్రెసిడెంట్ ఇన్ఫాంటినో మాత్రం ఇరాన్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. గ్రూప్-జి లో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు వంటి జట్లతో తలపడాల్సి ఉంది. మరి ఇరాన్ ప్లేయర్లు అమెరికాలో ల్యాండ్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్ లో బిగ్ క్వశ్చన్ మార్క్‌గా మారింది.

Read Also: ఏసీబీకి దొరికిపోయిన మహిళా సీఐ, ఎస్సై

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>