కరీంనగర్‌లో ఉద్రిక్తత.. గంగుల అరెస్టుకు నిరసనగా ర్యాలీ!

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ బంద్ సందర్భంగా నగరంలో హైడ్రామా చోటుచేసుకుంది. గంగుల కమలాకర్ నివాసం వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. బంద్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గంగుల కమలాకర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

​తమ నాయకుడి అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ​పోలీసులతో నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో ఎటుచూసినా పోలీసుల పహారా కనిపిస్తోంది. బంద్ విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నిస్తుండగా, పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి నిలువరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>