కలం, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది మార్చి చివరికల్లా హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ను ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) అధికారులకు స్పష్టం చేశారు. బదిలీ ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సజావుగా, గడువులోగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం ఎల్అండ్టీ కీలక సిబ్బంది, ప్రభుత్వాధికారులతో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బదిలీ ప్రక్రియ ప్రస్తుత ఒప్పందాలకు ఎలాంటి అవాంతరం కలిగించకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. మెట్రోను ప్రభుత్వానికి స్వాధీనం చేసే ప్రక్రియను 100 రోజుల్లో అప్పగించేలా ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు.
ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఐడీబీఐ తుది నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. బదిలీకి పూర్తిగా సహకరించాలని ఎల్అండ్టీని కోరారు. ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాక మెట్రో(Metro) కార్యకలాపాలు, నిర్వహణపై తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని మెట్రోరైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి హైదరాబాద్‌లో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థను ఎల్అండ్టీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నిర్వహణ లోపాలు, బ్యాంకుల్లో రుణాల ఒత్తిడి కారణాలుగా చూపుతూ మెట్రోను ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఎల్అండ్టీ ఒప్పందం కుదుర్చుకుంది.
Read Also: ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్
Follow Us On: Youtube


