కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) లో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం (MLC Appointments) పై హైకోర్టులో పిటిషన్ దాఖలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడం చట్టవ్యతిరేకమని ఆరోపిస్తూ ఈ వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ హైదర్ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేశారు. గత నెల 26న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 71 ఆధారంగా అజారుద్దీన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా నియమించిన విషయాన్ని ఆయన సవాలు చేశారు.
పిటిషనర్ వాదన ప్రకారం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేషన్ పొందడానికి రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలు వారిద్దరికీ లేవని పేర్కొన్నారు. ఈ నియామకాలు చట్టపరంగా సరైనవి కావని, ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ నేపథ్యంలో జీవో 71 అమలును వెంటనే నిలిపివేయాలని, అలాగే ఈ నియామకాలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుండటంతో, ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: విజయ్ TVKకు కాంగ్రెస్ మద్దతు.. కానీ ఒక్క షరతు!
Follow Us On : WhatsApp

