HPS భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను : కవిత సంచలన ఆరోపణలు

కలం, వెబ్‌ డెస్క్‌ : ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) చుట్టూ రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ స్కూల్‌కు చెందిన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకోవడానికి కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కవిత (Kavitha) ఆరోపణలు చేశారు. ఈ పాఠశాల పూర్తిగా ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే నడుస్తోందని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత కమిటీలో ముఖ్యమంత్రి బంధువులే నిండిపోయారని.. ఒకే అధికారిణి గత 14 ఏళ్లుగా ఒకే పదవిలో కొనసాగడం వెనుక మర్మమేమిటని ఆమె ప్రశ్నించారు.

సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు విదేశాల నుంచి భారీగా విరాళాలు ఇస్తున్నా వాటి లెక్కలు బయట పెట్టడం లేదని కవిత ఆక్షేపించారు. పాఠశాలకు అందుతున్న విరాళాల విషయంలో జవాబుదారీతనం లోపించిందని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో ఈ వ్యవహారంలో పారదర్శకత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్‌పీఎస్ వ్యవహారాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని, పబ్లిక్ స్కూల్ ఆస్తులను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>