సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయాక ట్రోలింగ్ కూడా తీవ్రతరమైంది. అందులోనూ సెలబ్రిటీలంటే మామూలుగా ఉండదు. వాళ్లు ఏం చేసినా ట్రోల్ చేస్తారు. ఆఖరికి వాళ్లకు అవార్డులు వచ్చినా ట్రోల్ చేస్తుంటారు. అవార్డులు కొనుకున్నారని అంటారు. ఇటీవల ఇలాంటి ట్రోల్స్‌ను చాలా మంది యాక్టర్స్ ఎదుర్కొన్నారు. వాళ్లలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) కూడా ఒకడు. తాజాగా అభిషేక్ నటించిన ‘ఐ వాంట్ టు టాక్(I want to talk)’ సినిమాలో అతని పర్ఫార్మెన్స్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్(Filmfare Award) లభించింది. అతనికి ఒక అవార్డ్ వస్తే.. కొనుక్కున్నాడని, అతనికి అవార్డ్ ఇచ్చిన తలకుమాసిన వాడు ఎవడు? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ భారీగా జరిగాయి. ‘‘కెరీర్‌లో ఒక్క సోలో హిట్ లేదు కానీ, గట్టి పీఆర్ టీమ్‌తోనే పేరును నిలబెట్టుకుంటున్నాడు’’ అని ట్రోల్స్ చేశారు. తాజాగా వీటిపై అభిషేక్ రెస్పాండ్ అయ్యాడు.
‘‘మీకు సూటిగా చెప్పాలనుకుంటున్నా.. నేను ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా కొనలేదు. నాకోసం ఎలాంటి పీఆర్ టీమ్ కూడా పనిచేయట్లేదు. నాకు తెలిసింది.. కష్టపడి పనిచేయడం, రక్తం, చెమట, కన్నీళ్లతో నా స్థానాన్ని నిలబెట్టుకోవడం, సంపాదించుకోవడమే. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. కానీ మిమ్మల్ని తప్పు అని నిరూపించడానికి నేను చేయగలిగింది ఒక్కటే.. ఇంకా కష్టపడి పనిచేయడం. రానున్న కాలంలో నా పనితీరే మీకు సమాధానం చెప్తుంది’’ అని Abhishek Bachchan చెప్పుకొచ్చాడు.
Read Also: హైదరాబాద్‌లో ఏఆర్ రెహ్మాన్ లైవ్ కాన్సర్ట్..

