Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌హ‌బూబాబాద్‌లో పోలీసుల ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీ

కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ విజయవంతమైంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీసులు అరైవ్ అలైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలీసు సిబ్బందితో పాటు, ప్రజలు భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్‌పై ప్రయాణం చేసే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మన ప్రాణాలను, మన కుటుంబాలను మనమే కాపాడుకోవాలని అంద‌రూ క‌లిసి ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తన కూమార్తెతో పాటు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొని అందరిలో స్ఫూర్తిని నింపారు. ఈ మేరకు ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు హెల్మెట్ ఖచ్చితంగా ధరించి మేము సైతం ఈ మార్పులో భాగమవుతామని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>