Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది: స్వామివారిని దర్శించుకునేందుకు 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 83,271 మంది భక్తులు దర్శించుకోగా.. 25,018 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవుదినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

అటు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రముఖ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి (Vontimitta) ఆలయంలో ఆదివారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్య ఆరాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు రామయ్యకు పుష్పయాగం నిర్వహించారు. తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలిదళం వంటి పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. 12 రకాల పుష్పాలు.. ఆరు రకాల పత్రాలతో స్వామివారికి పూజ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తారు. అలాగే నిత్యకైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ యాగాన్ని చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

Read Also:  భారీగా తగ్గిన బంగారం ధరలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>