Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా తగ్గిన బంగారం ధరలు

కలం, వెబ్ డెస్క్: కొద్దిరోజులుగా బంగారం ధరలు (Gold Prices) తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనాలనుకునే సామాన్యుడికి కాస్త ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో రూ.1,50,930గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 మేర తగ్గి రూ.1,49,130గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం నాటికి రూ.1,38,350 ఉండగా సోమవారం రూ.1,650 తగ్గి రూ.1,36,700 గా ఉంది. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 2,55,000గా ఉంది.

24 క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ ధర (Gold Prices) వివిధ నగరాల్లో స్వల్ప తేడా ఉంది. చెన్నైలో రూ.15,066 ఉండగా.. ముంబైలో రూ.14,913 గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో రూ.14,928 ఉండగా.. కలకత్తాలో రూ.14,913 ఉంది. బెంగుళూరులో రూ.14,913, హైదరాబాద్ లో రూ. 14,913 ఉంది. ఇక కేరళలో రూ.14,913.. పూణేలో రూ.14,913.. వడోదరలో రూ.14,918, అహమ్మదాబాద్ లో రూ.14,918 గా ఉంది.

Read Also: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>