Mobile Popup Ad
Mobile Popup Ad

గైక్వాడ్ తీసుకున్న ఈ నిర్ణయాలే చెన్నై ఓటమికి కారణమా?

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​ (CSK vs RCB)లో 43 పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలైంది. ఈ ఓటమితో చెన్నై వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైనట్లయింది. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యూహాలు జట్టు కొంపముంచుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బౌలింగ్‌లో అన్నీ తప్పుడు నిర్ణయాలే..

ఈ మ్యాచ్‌ (CSK vs RCB) లో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కెప్టెన్సీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడే ఆర్‌సీబీ బ్యాటర్లపై ప్రశాంత్ వీర్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే జేమీ ఓవర్టన్ స్పెల్‌ను త్వరగా ముగించకుండా.. భారీగా పరుగులు ఇస్తున్న నూర్ అహ్మద్‌కు ఆఖరి ఓవర్ ఇచ్చారు. శివమ్ దూబే మొదటి ఓవర్లో సక్సెస్ అయినప్పటికీ, రెండో ఓవర్లో విఫలమవుతారని తెలిసినా అతడికే బంతిని అందించారు. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా గైక్వాడ్ తడబడ్డారు.

సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు..

మరోవైపు చెన్నై ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) బ్యాటింగ్ మాత్రమే సానుకూలాంశంగా నిలిచింది. ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్, రుతురాజ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. నాలుగో నంబర్‌లో వచ్చిన సర్ఫరాజ్ ధైర్యంగా ఆడారు. తన పాత ఫ్రాంచైజీపై హాఫ్ సెంచరీతో మెరిశారు. పవర్‌ప్లేలో వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వకుండా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కార్తీక్ శర్మ కంటే ముందే సర్ఫరాజ్‌ను పంపాలన్న మేనేజ్‌మెంట్ నిర్ణయం సరైనదని నిరూపితమైంది.

ఇంపాక్ట్ ప్లేయర్ వాడకంలో వైఫల్యం..

ఈ మ్యాచ్‌లో చెన్నై ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను సరిగ్గా వాడుకోలేదు. కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే మ్యాచ్ ముగించింది. జట్టు ప్రణాళికల్లో లేని ప్రశాంత్ వీర్ స్థానంలో మ్యాట్ షార్ట్ లేదా అకీల్ హోసేన్‌ను ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జాకబ్ డఫీ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో మ్యాట్ షార్ట్ కీలకంగా మారే అవకాశం ఉన్నా, అతడిని కాదని కార్తీక్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవడం జట్టుకు నష్టం చేకూర్చింది.

Read Also: ప్రియుడితో జంప్.. భార్యను కడతేర్చిన భర్త

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>