Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు!

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ వైష్ణవ క్షేత్రం తిరుమల (Tirumala)లో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది. శ్రీనివాసుడి ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 75,691 భక్తులు దర్శించుకోగా.. 39,050 భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న 4.08 లక్షల లడ్డులు విక్రయించినట్లు దేవస్థానం స్పష్టం చేసింది. స్కూళ్ళు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సెలవుల దృష్ట్యా తెలుగురాష్ట్రాల్లోని భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>