Mobile Popup Ad
Mobile Popup Ad

రూ.100 కోట్ల క్లబ్‌లోకి పెద్ది.. కలెక్షన్ల సునామీ

కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) మూవీ తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి కలెక్షన్ల సునామీ ప్రారంభించింది. నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 135.36 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. రామ్ చరణ్ కెరీర్లోనే తొలి రోజే రూ.వంద కోట్లు సాధించిన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే గ్రాస్ కలెక్షన్లు రూ.500 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండేళ్ల తరువాత హిట్..

రామ్ చరణ్​ చివరి చిత్రం ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ కావడంతో పెద్ది మూవీని ప్రతిష్ఠ్మాతకంగా తీసుకున్నారు. రెండేళ్లుగా ఈ మూవీ కోసమే కష్టపడినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. మరీ ముఖ్యంగా కుస్తీ పోటీల్లో పహిల్వాన్ పాత్ర కోసం విపరీతంగా శ్రమించాడు. బలమైన పాత్రలతో పాటు రామ్ చరణ్ నటన, భావోద్వేగపూరిత సన్నివేశాల కారణంగా సినిమా బ్లాక్ బస్టర్ అయినట్లు మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>