చేవెళ్ల(Chevella) రోడ్డు ప్రమాదంలో హృదయవిదారక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మృతుల్లో 14 నెలల పసికందు, ఆమె తల్లి ఉండటం అందరినీ కలిచివేస్తోంది. చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందగా.. వారిలో తల్లి ఒడిలో ఉన్న 15 నెలల పసికందు ఉండటం అందరికీ కన్నీరు తెప్పిస్తున్నది. తల్లి చిన్నారిని కప్పి పట్టుకొని చివరి వరకు రక్షించేందుకు ప్రయత్నించినా… కంకర బరువుతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కంకర కుప్పల మధ్య తల్లీబిడ్డల మృతదేహాలను వెలికితీసే దృశ్యాలను చూసిన స్థానికులు, రక్షణ సిబ్బంది కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
బస్సులో ఎక్కువగా విద్యార్థులే
Chevella | తాండూరు నుంచి హైదరాబాద్ దిశగా బయలుదేరిన ఈ బస్సులో ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. ఉదయం పూట తరగతులకు, పనులకు వెళ్లేందుకు బయలుదేరిన వారు నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. బస్సు పూర్తిగా దెబ్బతినడంతో చాలామంది శరీరాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి. కంకర కుప్పల మధ్య కూరుకుపోయినవారిని బయటకు తీయడానికి రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. జేసీబీలు, అంబులెన్సులు, ఫైర్ సిబ్బంది గంటల పాటు శవాలను వెలికితీశారు.
Read Also: చేవెళ్ల ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Follow Us On : Instagram

