తనకంటే అందంగా ఉండొద్దని కుమారుడితో సహా నలుగురు చిన్నారులను ఓ మహిళ హతమార్చడం హర్యానా (Haryana)లో సంచలనంగా మారింది. గత మూడు రోజుల క్రితం స్థానికంగా ఉండే ఒక చిన్నారి నీటి టబ్బులో పడి మృతి చెందగా, తల్లిదండ్రులు సహజ మరణంగా భావించారు. అయితే, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా పూనమ్ (Poonam) హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మహిళను అరెస్ట్ చేసి విచారించగా పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
పానిపట్ ఎస్పీ భుపేందర్ సింగ్ కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు వివరించారు. హర్యానా (Haryana) రాష్ట్రం పానిపట్ ప్రాంతంలో ఉంటున్న పూనమ్ (Poonam) అనే 32 ఏళ్ళ మహిళ కుటుంబంలో తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదని జెలస్ ఫీలయ్యేది. ఈ క్రమంలోనే 2023 సంవత్సరంలో తన వదిన కూతురును తనకంటే అందంగా ఉందని చంపినట్లు తెలిసింది. చిన్నారిని హత్య చేస్తుండగా చూసాడని తన సొంత కొడుకుని కూడా హతమార్చినట్లు వెల్లడయింది.
వీరితో పాటు మరో ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేసినట్లు విచారణలో పూనమ్ ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. కేవలం.. తనకంటే అందంగా ఉన్నారని నలుగురు చిన్నారులను హతమార్చినట్లు నిర్ధారించుకుని ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు.
Read Also: మహిళా లాయర్లపైనా వివక్ష… ‘సుప్రీం’ బార్ అసోసియేషన్ సర్వే
Follow Us On: WhatsApp Channel


