‘నాకు ప్రాణహాని ఉంది’.. పోలీసులకు హర్షవీణ ఫిర్యాదు

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ లో సంచలనంగా మారిన హర్షవీణ (Harshaveena) పోలీసులను ఆశ్రయించారు. రైల్వే కోడూరులో తనకు రక్షణ లేదని, ప్రాణ హాని ఉందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్​, జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, టీడీపీ నేత నాగేంద్ర రూపానందరెడ్డి పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన ఘటనలో ఆమె (Harsha Veena) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ‘కోడూరులో నాకు, నా కుటుంబానికి, నా లాయర్​ కుటుంబానికి ఎవరికీ రక్షణ లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏం జరిగినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్​, టీడీపీ నేత రూపానంద రెడ్డి బాధ్యులవుతారని.. వారు తప్ప తమకు వేరే శత్రువులు లేరని హర్షవీణ తెలిపారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, గత కొన్ని నెలలుగా రైల్వే కోడూరుతో పాటు ఏపీ వ్యాప్తంగా హర్షవీణ రిలీజ్​ చేసిన వీడియోలు రాజకీయ సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్​ (Arava Sridhar) పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ వీడియోలు విడుదల చేశారు హర్షవీణ. ఈ క్రమంలో ఆమెపై కేసులు నమోదు కాగా హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్​ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే రైల్వే కోడూరులో హర్షవీణపై (Harshaveena) దాడి జరగడం గమనార్హం.

Read Also: అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>