కేరళలో రాహుల్ ఎన్నికల క్యాంపెయిన్.. అప్పం, పుట్టు తింటూ..!

కలం, వెబ్ డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు యూడీఎఫ్ (UDF) నేతలను కలిశాడు. స్థానిక హోటల్‌లో అప్పం, పుట్టు, ఆమ్లెట్ వంటి కేరళ వంటకాలను రుచి చూస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, యువతకు నిజమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి కొండంత అండగా నిలిచే ప్రభుత్వం కావాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి కేరళ ప్రజలకు ఒక నూతన ఆశాకిరణం అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే సత్తా తమకే ఉందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Read Also: కొడుకుకు ‘భరత్’ అని పేరు పెట్టిన పాకిస్థాన్ మహిళ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>