కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక (Rashmika)ల పెళ్లి ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లపాటు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఉదయపూర్ లో బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా వివాహం జరుపుకుంది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ చేశారు. అంతేనా పెళ్లయిన వెంటనే ఈ కొత్త జంట ఏకాంతంగా హనీమూన్‌కు వెళ్లకుండా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో బడ్డీమూన్‌కు వెళ్లింది. అత్యంత సన్నిహితులతో చేసే విహారయాత్రే ఈ బడ్డీమూన్. ఆ తర్వాత ఈ నూతన దంపతులు ఇతర పెళ్లి వేడుకలకు కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక (Rashmika) సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’ అంటూ ఓ చిన్న యానిమేషన్ వీడియో క్లిప్‌ను ఆమె షేర్ చేశారు. అందులో రష్మిక, విజయ్‌తో పాటు ఓ పొద్దుతిరుగుడు పువ్వు ఉంది. రష్మిక టీ షర్ట్‌పై గుడ్డు ఫోటో కూడా ఉంది. దీంతో చాలామంది రష్మిక తల్లి కాబోతోందా? ఒక నెలలోనే గుడ్‌న్యూస్ చెప్పారు అంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే నిజానికి పొద్దుతిరుగుడు పువ్వును రష్మిక తన క్లోజ్ ఫ్రెండ్‌గా భావిస్తుంది. దానికోసం ఆమె ప్రత్యేకంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా నిర్వహిస్తోంది. ఆ యానిమేషన్ ప్రపంచంలోకి ఇప్పుడు విజయ్‌ను కూడా ఆహ్వానిస్తూ ఈ పోస్ట్ పెట్టింది తప్ప, ఆమె గర్భవతి అనే వార్తల్లో నిజం లేదని తేలింది.
Read Also: ఆపిల్ జాబ్ వదిలి, ఆటో డ్రైవర్‌గా మారి.. రియల్ హీరో రాకేశ్!
Follow Us On : WhatsApp

