జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) బీఆర్‌కే భవన్‌లోని ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున పార్టీ కార్యకర్తలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, ఈ విషయానికి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని హరీష్ రావు వెల్లడించారు. ఆ ఆధారాలన్నింటినీ ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించి, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు.
బీఆర్ఎస్(BRS) నేతల ప్రకారం, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ప్రమాదమని వారు విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు, డబ్బు ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని హరీష్ రావు కోరనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు కూడా హరీష్ రావు(Harish Rao)తో పాటు పాల్గొననున్నారు.
Read Also: 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
Follow Us on: Instagram

