బెంగళూరు(Bengaluru)లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో జైళ్లో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతున్న వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే జైళ్లో ఖైదీలు మందుపార్టీ చేసుకున్న వీడియో బయటకు రావడం గమనార్హం. తాజాగా ఖైదీలు మద్యం పార్టీ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ సరదాగా గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనలు వరుసగా బయటపడడంతో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో జైలులోని ఓ గదిలో టేబుల్‌పై మద్యం సీసాలు, డిస్పోజబుల్ గ్లాసులు, కొన్ని తినుబండారాలు కనిపిస్తున్నాయి. అక్కడే కొంతమంది ఖైదీలు పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ హుషారుగా గడుపుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారం, హత్యల వంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
Bengaluru | ఇదే జైలులో గతంలో కన్నడ నటుడు దర్శన్ కూడా ఖైదీగా ఉండగా, అతనికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. జైలులో దర్శన్ ఇతర ఖైదీలతో కలసి భోజనం చేస్తూ ఉన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనలు బయటపడటంతో పరప్పన అగ్రహార జైలు వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం ఈ ఘటనలపై అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Read Also: ‘పెద్ధి’ నా కల నెరవేర్చింది: చెర్రీ
Follow Us on: Youtube

