కలం, వెబ్ డెస్క్: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై (Professor Nageshwar) ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తుండటాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ‘ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదు. వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని తెలిపారు.
అసలు వివాదం ఏంటంటే..
ప్రొఫెసర్ నాగేశ్వర్ (Professor Nageshwar) ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడుతూ.. జగన్‌ను జైల్లో వేయాలని పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరగా.. ఆయన తమకు దీర్ఘ కాలిక మిత్రుడని.. జగన్‌తో గొడవ పెట్టుకోవద్దని పవన్‌కు షా సూచించినట్లు జనసేన విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు సమాచారం ఉందని వివరించారు. దీనిపై జనసేన నేతలు భగ్గుమన్నారు. అదంతా వట్టి ప్రచారమంటూ.. కాకినాడతో సహా పలు జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా, కేసులు నమోదు అయ్యాయి.
Read Also: తమిళనాడు సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్..!
Follow Us On: Pinterest

