కలం, వెబ్ డెస్స్ : వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అని.. ఆ పార్టీతో సమాజానికి హానీకరం అని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావద్దని ప్రజలందరూ నినదించాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా యాదమరిలో పర్యటించిన చంద్రబాబు సంజీవని ప్రాజెక్టు అమలు తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో జనాలను కాపాడే రాజకీయాలు ఒకవైపు ఉంటే మరోవైపు ప్రజలు భయపెట్టి మోసం చేసే రాజకీయాలను ఉన్నాయని వైసీపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ ను విజయవంతం చేస్తే గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోయిందన్నారు. ఆ పార్టీ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

