కలం, సినిమా : కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ టాక్సిక్” (Toxic). ఈ బిగ్గెస్ట్ మూవీని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ వివాదాస్పదంగా మారింది. టీజర్‌లో ఉన్న ఇంటిమేట్ సీన్స్ చూసి మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఈ టీజర్‌ను బ్యాన్ చేయమని మహిళా కమీషన్ సీబిఎఫ్‌సి (CBFC) కి లేఖ కూడా రాసింది. కానీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ రిలీజ్ చేసే టీజర్స్‌కి సెన్సార్ వర్తించదని CBFC తేల్చి చెప్పింది.
అయితే ఆ ఇంటిమేట్ సీన్స్ లో నటించిన బ్యూటీ ఎవరా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేసారు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఆమె ఎవరో రివీల్ చేసారు. ఆమె పేరు బీట్రీజ్ టోఫెన్ బాఖ్ (Beatriz Taufenbach) అని హాలీవుడ్‌లో ‘బ్రూక్లిన్ నైన్ నైన్’ (Brooklyn Nine-Nine) అనే టీవీ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నట్లు వెల్లడించారు. దీనితో ఒక్కసారిగా ఈ భామ ఫుల్ పాపులర్ అయిపోయింది. ఇంస్టాగ్రామ్‌లో ఈమెకు భారీగా ఫాలోవర్స్ పెరిగారు. అయితే తాజాగా బీట్రీజ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసింది. ఈ వివాదం ముదరడంతోనే బీట్రీజ్ తన ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిందని న్యూస్ వైరల్ అవుతుంది.


