కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిలో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ సభ(Siddipet Meeting)లో రేవంత్ గంట సేపు మాట్లాడితే తమ పేర్లను 140 సార్లు ప్రస్తావించారని గుర్తు చేశారు. దీన్ని బట్టి ఆయనకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
ప్రజలకు కోసం ప్రకటించిన జీవిత బీమా, ప్రమాద బీమా పథకాల గురించి సభ ఏర్పాటు చేసి అసలు ఆ అంశాల గురించే ప్రస్తావించలేదని హరీశ్ రావు ఆరోపించారు. అసలు విషయం పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, తన పేర్లను పదేపదే ప్రస్తావించారన్నారు. ఈ సభలో కేసీఆర్ పేరును 63 సార్లు, కేటీఆర్ పేరును 24 సార్లు, తన పేరును 53 సార్లు మాట్లాడారని ఆయన (Harish Rao) చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగమే ఆయనలోని అసహనానికి నిదర్శనమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. పేరేంటంటే?
Follow Us On : WhatsApp

