రైతులకు రూ. 19 వేల కోట్ల బకాయిలు:హరీశ్‌రావు

కలం, వెబ్ డెస్క్: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)  ప్రశ్నించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సన్నాలకు ఇస్తామన్న బోనస్ ఏమైందని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుకూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని మోసం చేశారని ప్రశ్నించారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం రైతులు పంటలు వేసుకొనే ముందు వేయాలని.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పథకాన్ని ఎన్నికల కోసం వాడుకుంటుందని ఫైర్ అయ్యారు.

బోనస్ బోగస్ అయ్యింది

సన్న బియ్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పథకాన్ని బోగస్ కింద మార్చేసిందని హరీశ్ రావు (Harish Rao)   వ్యాఖ్యానించారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని.. రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ యాసంగి సీజన్ కైనా వరికి బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గత రెండేండ్లుగా అకాల వర్షాలతో , వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ‘పంటల బీమా అమలు చేయకపోతే రైతులు ఏం కావాలి? ఇన్ పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదు.’ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధులు కేటాయించి వాటిని కేటాయించడం లేదని ఫైర్ అయ్యారు.

నిరుద్యోగులకు మోసం

కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను దారుణంగా వంచించిందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో హరీశ్ రావు మహాకవి శ్రీశ్రీ కవితను ప్రస్తావించారు.  ‘కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం’ అంటూ గతంలో భట్టి విక్రమార్క తమ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి అలాగే ఉందని పేర్కొన్నారు. అశోక్ నగర్ వెళ్లి చూస్తే నిరుద్యోగులు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే: మ‌ల్లారెడ్డి

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>