Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే: మ‌ల్లారెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి (Malla Reddy) మ‌రోసారి సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసింది నేనే అని మ‌ల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సోమ‌వారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన మ‌ల్లారెడ్డి రాజ‌కీయాలు, సినిమాల‌పై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తానూ అన్న‌ద‌మ్ముల‌మేన‌ని చెప్పారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో రేవంత్ త‌ప్ప ప‌వ‌ర్‌ఫుల్ నాయ‌కులు ఎవ‌రూ లేర‌ని రెడ్డి సంఘం స‌మావేశంలో చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇక‌ సినిమాలో సీఎం పాత్ర చేయాల‌ని ఉంద‌ని మ‌ల్లారెడ్డి (Malla Reddy) వెల్లడించారు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో విల‌న్ పాత్ర చేయాల‌ని డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కోరార‌ని, అయితే దానికి నో చెప్పాన‌ని తెలిపారు. ప‌క్క‌నే ఉన్న మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మ‌ల్లారెడ్డిపై సెటైర్లు వేశారు. నువ్వు విల‌న్ క్యారెక్ట‌ర్‌కే సెట్ అవుతావ‌ని కామెంట్ చేశారు. విల‌న్ పాత్ర‌కే ఎలివేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, విల‌న్ రోల్స్ చేయాల‌ని సూచించారు.

Read Also: మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ కీలక హామీ

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>