Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టగానే భట్టి మారిపోయాడు: హరీశ్ రావు

కలం మెదక్ బ్యూరో: భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తన పాదయాత్ర సందర్భంగా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. భట్టి ప్రజాభవన్‌లోకి వెళ్లగానే మారిపోయాడని ఆరోపించారు. సోమవారం సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆర్టిజన్స్ ఎంప్లాయిస్ సమ్మెకి హరీశ్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించకుంటే బీఆర్ఎస్ తరపున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిజెన్లు ధర్నాలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇది ప్రజా పాలన కాదు రాక్షస పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>