కలం, వెబ్ డెస్క్ : మొయినాబాద్ లోని ఫామ్‌హౌస్ (Moinabad Farmhouse) డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohith Reddy)కి బిగ్ షాక్ తగిలింది. రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ అయింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను 16కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి (Rohith Reddy) చెందిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ ఘటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ రాగా.. ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సైతం ఉన్నారు. అయితే పుట్టా మహేశ్ ఈ కేసులో స్టేషన్ బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఈ వ్యవహారంపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి ల కస్టడీ గడువు నేటితో ముగిసింది. దీంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే నాలుగు సార్లు నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరికొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని నిందితును మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Read Also: ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టగానే భట్టి మారిపోయాడు: హరీశ్ రావు
Follow Us On: Pinterest

