కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST 2026-27) ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్ (DOST Notification) రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు తీసుకోనున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అనుబంధ కాలేజీల్లో ఈ ప్రవేశాలు అందుబాటులో ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు లేదా ఇతర బోర్డులు నుంచి సమానమైన ఎగ్జామ్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఫేజ్ – 1 లో ఏప్రిల్ 15 నుంచి మే 7, 2026 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉండగా.. ఏప్రిల్ 30 నుంచి మే 8 వెబ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మే 14న సీట్ అలాట్ మెంట్ జరుగుతుంది. మే 15 నుంచి మే 25 ఫేజ్-2 రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. మే 15 నుంచి మే 26, 2026 వరకు వెబ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మే 31 నుంచి జూన్ 15 వరకు ఫేజ్-3 రిజిస్ట్రేషన్ కొనసాగనుంది.
Read Also: ఆర్టీసీలో సమ్మె సైరన్.. తేదీ ప్రకటించిన జేఏసీ!
Follow Us On : WhatsApp

