epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రెండేళ్లలో కేసీఆర్​ మళ్లీ సీఎం అవుతారు : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : మరో రెండేళ్లలో కేసీఆర్​ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నివాసంలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్​ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతోందని హరీశ్​ రావు ఎద్దేవా చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని హరీశ్​ రావు విమర్శించారు. సగం మందికి కూడా బతుకమ్మ చీరలు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. కేసీఆర్(KCR)​ నాయకత్వంలో బీఆర్​ఎస్​ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు త్వరలోనే బుద్ధి చెబుతారని, రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హరీష్ (Harish Rao) వెల్లడించారు.

Read Also: కాంగ్రెస్‌లో గ్రూప్ రాజ‌కీయాల‌పై మంత్రి వివేక్ కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>