కలం, వెబ్ డెస్క్ : సోమవారం నస్తూర్ పల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాల సభలో కేసీఆర్ మాట్లాడే సమయానికే.. మాట్లాడడం ద్వారా రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమయింది అని అన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది చూస్తే.. రేవంత్ ప్రసంగాన్ని 4 లక్షల మంది చూశారన్నారు. కేవలం 10శాతం మంది కూడా రేవంత్ మీటింగ్ ను చూడలేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
తాను ఢిల్లీకి వెళ్లడంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన హరీశ్ రావు (Harish Rao).. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంటూ సీఎం పెట్టే అక్రమ కేసులపై లాయర్లతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఓటుకు నోటు కేసులో దొంగ భరతం పట్టడానికి లాయర్ తో మాట్లాడనని సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) తీర్పుపై సుప్రీమ్ కోర్టు పిటిషన్ వేసే అంశంతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై లాయర్లతో చర్చించానని చెప్పారు. దీనిపై సీఎంవో నుంచి రేవంత్ రెడ్డి అడ్డమైన లీకులు ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం ఉన్న వాడు ఇలాంటి చిల్లర పనులు చేయడని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
Read Also: జీతాలు కట్ చేసిన సీఎం.. దేశంలోనే మొదటిసారి!
Follow Us On: Instagram

